బిల్లులు చెల్లించాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

బిల్లులు చెల్లించాలని ఆందోళన

Jun 15 2026 12:05 AM | Updated on Jun 15 2026 12:05 AM

ముంచంగిపుట్టు: పీఎం జన్‌మన్‌ గృహాల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని గిరిజన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శి ఎంఎంశ్రీను, కె,నర్సయ్య కోరారు. మండలంలోని బంగారుమెట్ట, లక్ష్మీపురం పంచాయతీలోని పలు గ్రామాల్లో గిరిజన సంఘం ఆధ్వర్యంలో పీఎం జన్‌మన్‌ గృహాల బకాయి బిల్లులపై ఆదివారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ పీఎం జన్‌మన్‌ బకాయిలపై మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమ వారం లబ్ధిదారులతో ధర్నా చేయనున్నట్టు తెలిపారు.గృహాలు మంజూరు చేసి రెండేళ్లయినా నేటికీ సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడంతో మొండి గోడ లు దర్శనమిస్తున్నాయని, ఉన్న ఇల్లులు తొలగించి, కొంత ఇళ్లు పూర్తికాక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెరిగిన గృహ నిర్మాణ సామగ్రి ధరలతో అవస్థలు పడుతున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.10లక్షలు గృహా నిర్మాణానికి మంజూరు చేయాలని, బకాయిలు బిల్లులు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. లక్ష్మీపురం మాజీ సర్పంచ్‌ కె.త్రినాథ్‌, గిరిజన సంఘం నాయకులు, గృహ లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement