ముంచంగిపుట్టు: అంధ్ర–ఒడిశా రాష్ట్రాలు మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం ఆధునికీకరణకు చర్యలు తీసుకోవాలని ఒడిశా జలవిద్యుత్ కార్పొరేషన్ డైరెక్టర్ మహంతి అన్నారు. మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. విద్యుత్ కేంద్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి ఇటీవల జరిగిన ప్రమాదం తీరుపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఒడిశా జలవిద్యుత్ కార్పొరేషన్ డైరెక్టర్ మహంతి మాట్లాడుతూ మాచ్‌ఖండ్‌లో ప్రమాదం జరిగి 21 రోజులు జరుగుతున్నాయని, కొన్ని నెలల పాటు మరమ్మతు పనులు చేసే బదులుగా ఇరు రాష్ట్రాలు ఆధునికీకరణకు ముందుకు వస్తే ఎంతో బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్ర, ఒడిశా ఉన్నతాధికారులు ఆధునికీకరణపై అనుమతులు తీసుకువచ్చి పనులు మొదలు పెట్టాలని ఆయన కోరారు. మాచ్‌ఖండ్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగి 21 రోజులు గడిచిన తరువాత ఒడిశా అధికారులు ప్రాజెక్టు వచ్చి ప్రమాదంపై ఆరా తీయడంపై విమర్శలు గుప్పుమన్నాయి. సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్ కె.వి.రాజారావు, కొల్లబ్ జలవిద్యుత్ కేంద్రం ముఖ్య అధికారి చితరంజన్‌స్వాన్, వోహెచ్‌పిసి డీజీఎం శ్రీనివాసురావు, ఈఈ సివిల్ కురేష్ ప్రధాన్, ఈఈ జనరేషన్ గోవిందరాజులు తదితరులున్నారు.
ఒడిశా జలవిద్యుత్ కార్పొరేషన్ డైరెక్టర్ మహంతి


