పాడేరు రూరల్: ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం సుండ్రుపుట్టు సంఘం కార్యాలయంలో జరిగింది, కమిటీ నూతన అధ్యక్షుడిగా కాకి మద్దు (ఏలూరు), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుంజా శ్రీను (పోలవరం), రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వాబా యోగి (శ్రీకాకుళం), వంతాల నాగేశ్వరరావు (అల్లూరి జిల్లా), రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కుంజం కృష్ణంరాజు (ఏలూరు), రాష్ట్ర కోశాధికారిగా ఎడ్ల సూర్యనారాయణ (పార్వతీపురం మన్యం జిల్లా) ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మరో 20 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం కమిటీ నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తు ప్రజలపక్షాణ ఉండే ఆదివాసీ సంక్షేమ పరిషత్ భవిషత్ కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు.నూతన కార్యవర్గంతో ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతు ఆదివాసీల హక్కులు, చట్టాల పరిరక్షణకోసం మరింత పోరాటం చేస్తామన్నారు.రాష్ట్ర నాయకులు విజయకుమారి, బొంజుబాబు, బాలరాజు, రాంబాబు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.


