రమణ మృతదేహానికి అంత్యక్రియలు
నిర్వహిస్తున్న కుమార్తె చంద్రకళ
బుచ్చెయ్యపేట: అనారోగ్యంతో మృతిచెందిన తండ్రికి కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన ఆదివారం మండలంలోని వడ్డాదిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సయ్యపురెడ్డి రమణ ఆదివారం ఇంటి వద్ద గుండె పోటుతో మృతి చెందారు. ఇతనికి భార్య లక్ష్మితో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులు లేకపోవడంతో బంధువుల సహాయంతో చిన్న కుమార్తె చంద్రకళ తండ్రికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది.


