రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

Jun 15 2026 12:05 AM | Updated on Jun 15 2026 12:05 AM

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

ఘటనా స్థలంలో మృతదేహం

నక్కపల్లి: మండలంలో జానకయ్యపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. సీఐ మురళి తెలిపిన వివారాల ప్రకారం ఆదివారం గ్రామానికి చెందిన కర్రి సూర్యవెంకటసాయి(13) అనేబాలుడు మరో బాలుడుతో కలసి స్కూటీపై వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న కాలువలో పడింది.సాయి ముఖం, తలపై తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు.మృతదేహాన్ని పోస్టుమార్టానికి నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement