అనకాపల్లి టౌన్: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో శంకరం గ్రామం వద్ద రైలు నుంచి జారి పడి ఓ వ్యక్తి మృతి చెందినట్టు జీఆర్పీఎఫ్ ఎస్‌ఐ కె.టి.ఆర్. లక్ష్మి తెలిపారు. విశాఖపట్నం– విజయవాడ ట్రాక్‌లో మధ్యలో మృతదేహాన్ని గుర్తించామని, మృతుడి వయసు 35 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. బ్లాక్ కలర్ ట్రాక్ ఫ్యాంట్, మెరూన్ రంగు టీషర్ట్ ధరించి ఉన్నాడని తెలిపారు. ఒక టచ్ ఫోన్, ఆధార్ కార్డు, చిరిగిన జనరల్ రైల్వే టికెట్ లభించాయని, వాటి ప్రకారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల గ్రామంలో కీర్తివీధికి చెందిన ఇట్లా భాస్కరరావుగా గుర్తించామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, బంధువులకు సమాచారం అందించినట్టు ఎస్‌ఐ చెప్పారు.


