చింతపల్లి: చింతపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు(35) సొలబం కృష్ణప్రసాద్ దుర్మరణం చెందాడు. శుక్రవారం రాత్రి అంతర్ల సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆయన్ను బొలోరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఈయన జీకే వీధి మండలం లక్కవరపేట పంచాయతీ మామిడి గ్రామ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు శనివారం చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో ఉన్న కృష్ణప్రసాద్ మృతదేహాన్ని సందర్శించి, ఘన నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోతురాజు బాలయ్యపడాల్, ఎంఈవో పనసల ప్రసాద్, బోడం నాయుడు, గిరిజన ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు కిట్లంగి ప్రసాద్, పార్టీ రాష్ట్ర ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, రైతు సంఘం రాష్ట్ర సహా య కార్యదర్శి బూసరి కృష్ణారావు, జి.మాడుగులు మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకట గంగరాజు, మాజీ సర్పంచ్ దురియా పుష్పలత పాల్గొన్నారు.


