ఫేషియల్‌ విధానంరద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఫేషియల్‌ విధానంరద్దు చేయాలి

Jun 14 2026 7:28 AM | Updated on Jun 14 2026 7:28 AM

అరకులోయటౌన్‌(పాడేరు రూరల్‌): అరకులోయటౌన్‌ (పాడేరు రూరల్‌): ఉపాధి హామీ పథకంలో అమలు చేస్తున్న ఫేషియల్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని వైఎస్సార్‌సీపీ ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధికార ప్రతినిధి శెట్టి అప్పాలు డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చిన కొత్త మార్పులు కూలీలకు ఇబ్బందులను కలిగిస్తున్నాయన్నారు. నూతన విధానం వల్ల ఉపాధి కూలీలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, పాత విధానాన్నే కొనసాగించాలని కోరారు. ప్రతిరోజూ పని ప్రదేశంలో ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం, ఫేషియల్‌ ద్వారా హాజరు నమోదు చేయడం వల్ల పనులు సమయానికి పూర్తి కావడంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి, ఉపాధి కూలీలకు అనుకూలమైన విధానాన్ని అమలు చేయాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement