సుఖీభవ.! | - | Sakshi
Sakshi News home page

సుఖీభవ.!

Jun 14 2026 7:28 AM | Updated on Jun 14 2026 7:28 AM

రక్తదాతా..

ఆపద సమయంలో

అందుబాటులో రక్త నిల్వలు

వైఎస్సార్‌సీపీ హయాంలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఏర్పాటుతో విస్తృత సేవలు

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

సీహెచ్‌సీలో గంటల తరబడిరోగుల నిరీక్షణ

సాంకేతిక సమస్యతో తప్పని అష్టకష్టాలు

సాక్షి, పాడేరు: రక్తదానం ఎంతో మంది ప్రాణాలను కాపాడే సంజీవిని. ఏజెన్సీ ప్రాంతంలో యువత రక్తదానంతో ప్రాణదాతలుగా నిలుస్తూ మానవత్వాన్ని చా టుకుంటున్నారు. తోటి మనుషుల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్న యువకులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివారం రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

పెరిగిన రక్త అవసరాలు

వైద్యపరంగా వెనుకబడిన ప్రాంతాల్లో రక్త అవసరాలు గణనీయంగా పెరిగాయి. గర్భిణులు, రక్తహీనతతో బాధపడుతున్న బాలికలు, యువతులు, మహిళలు, సికిల్‌సెల్‌ ఎనిమియా రోగులు, ప్రమాదాల కేసుల్లో అత్యవసర పరిస్థితుల్లో రక్త వినియోగం అధికమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 11 మండలాల్లో రక్తదాన శిబిరాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

103 శిబిరాలుం 3506 యూనిట్ల సేకరణ

2022లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రం పాడేరులో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి రక్తదానంపై అవగాహన పెంచుతూ రక్త సేకరణలో కీలక పాత్ర పోషిస్తోంది ఈ సంస్థ. 2022 నుంచి ఈ ఏడాది జూన్‌ 12 వరకు జిల్లా వ్యాప్తంగా 103 రక్తదాన శిబిరాలను నిర్వహించి 3506 యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన రోగులకు అందించింది. అలాగే పాడేరు జిల్లా ఆసుపత్రిలోని బ్లడ్‌ బ్యాంక్‌కు నేరుగా వచ్చిన దాతల నుంచి గత ఆరు నెలల్లో 778 యూనిట్ల రక్తాన్ని సేకరించి వినియోగించారు.

రెండు చోట్ల బ్లడ్‌ బ్యాంకులు

పాడేరు జిల్లా ఆసుపత్రి, అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రులు బ్లడ్‌ స్టోరేజ్‌ పాయింట్ల స్థాయి నుంచి బ్లడ్‌ బ్యాంకులుగా అప్‌గ్రేడ్‌ అయ్యాయి. దీంతో ఏజెన్సీ ప్రాంత రోగులకు సకాలంలో రక్తం అందే పరిస్థితి ఏర్పడింది. గతంలో విశాఖ, అనకాపల్లి, నర్సీపట్నం ప్రాంతాల నుంచి రక్తం తెప్పించుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. అదే విధంగా చింతపల్లి, ముంచంగిపుట్టు సీహెచ్‌సీల్లో కూడా బ్లడ్‌ స్టోరేజ్‌ పాయింట్లు ఏర్పాటు చేయడంతో అత్యవసర సేవలు మరింత మెరుగుపడ్డాయి.

విద్యార్థి దశ నుంచే మానవత్వం

ఏజెన్సీ ప్రాంతంలోని విద్యార్థులు, యువత రక్తదానంలో ముందుండి ఆదర్శంగా నిలుస్తున్నారు. కళాశాలల్లో రక్తదానంపై అవగాహన పెరగడంతో అనేక మంది 10 నుంచి 30 సార్లు రక్తదానం చేసిన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో, తదితర అధికారులు కూడా శిబిరాల నిర్వహణకు సహకరిస్తూ రక్తదానంపై చైతన్యం తీసుకొస్తున్నారు.

‘అభా’ యాప్‌తో అవస్థలు

ముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో రోగులు సాంకేతిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతన నిబంధనల ప్రకారం ఆసుపత్రిలో చికిత్స పొందాలంటే ముందుగా అభా యాప్‌లో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి కావడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. శనివారం అధిక సంఖ్యలో రోగులు సీహెచ్‌సీకి తరలివచ్చారు. రోగుల మొబైల్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి, ఫోన్‌ నంబర్‌ నమోదు చేయాలి. అనంతరం ఓటీపీ నమోదు చేసిన తరువాత క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసే ప్రక్రియ ఉండటంతో ఆలస్యం ఏర్పడింది. సిగ్నల్స్‌ లేకపోవడంతో యాప్‌ సక్రమంగా పని చేయడం లేదు. దీంతో రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. కొంతమంది రోగులకు మొబైల్‌ ఫోన్లు లేకపోవడంతో మరింత ఇబ్బందులు ఎదురయ్యాయి. గిరిజన ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సమస్యలు ఉండటంతో యాప్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. అవసరం లేని కొత్త నిబంధనలతో రోగులను ఇబ్బందులకు గురిచేయడం తగదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

వేధిస్తున్న సిబ్బంది కొరత

కొన్ని గంటల తరువాత యాప్‌ పని చేయడం ప్రారంభించడంతో రిజిస్ట్రేషన్‌ కోసం రోగులు పోటీపడ్డారు. అనంతరం వైద్య సేవలు పొందగలిగారు. ఇదిలా ఉండగా, సీహెచ్‌సీలో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. కేవలం ఇద్దరు వైద్యులే అందుబాటులో ఉండటంతో రోగులు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడి చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైద్యులు ఒకవైపు ఓపీ, మరోవైపు అత్యవసర కేసులను చూసుకోవాల్సి రావడంతో పని ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య విధాన పరిషత్‌ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, అభా యాప్‌ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించాలని రోగులు కోరుతున్నారు.

ఐలా చైర్మన్‌గా యార్లగడ్డ ఎన్నిక

అక్కిరెడ్డిపాలెం: ఆటోనగర్‌ ఇండస్ట్రియల్‌ లేబర్‌ అసోసియేషన్‌ (ఐలా) ఎన్నికల్లో యార్లగడ్డ సాంబశివరావు ప్యానెల్‌ సత్తా చాటింది. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి కొల్లి ఈశ్వరరావు ప్యానెల్‌పై యార్లగడ్డ సాంబశివరావు ఒక్క ఓటు తేడాతో విజయం సాధించి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత రెండోసారి చైర్మన్‌ పదవిని సాంబశివరావు దక్కించుకోవడం విశేషం. ఓట్ల లెక్కింపు రాత్రంతా ఉత్కంఠభరితంగా సాగగా, రెండు ప్యానెళ్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇతర పదవులకు జరిగిన ఎన్నికల్లో కొల్లి ఈశ్వరరావు ప్యానెల్‌కు చెందిన బాపిరాజు వైస్‌ చైర్మన్‌గా, నిర్మల్‌ దుర్గర్‌ జాయింట్‌ సెక్రటరీగా, ఎ.సూర్యనారాయణరాజు ట్రెజరర్‌గా, కోటేశ్వరరావు సభ్యుడిగా ఎన్నికయ్యారు. పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రక్తదానంపై ఏజెన్సీలో పెరిగిన చైతన్యం

రక్తదానం చేయాలంటే..

18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఆరోగ్యవంతులైన వ్యక్తులు రక్తదానం చేయవచ్చు. రక్తపోటు, హిమోగ్లోబిన్‌, శరీర ఉష్ణోగ్రత తదితర పరీక్షల అనంతరం మాత్రమే రక్త సేకరణ చేస్తారు. రక్తదానం వల్ల ఎలాంటి వ్యాధులు సంక్రమించవు. రక్తదానం చేసిన తర్వాత 10 నిమిషాల విశ్రాంతి తీసుకుని అల్పాహారం తీసుకుంటే తిరిగి సాధారణ పనులు చేసుకోవచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు.

అందుబాటులో రక్తనిల్వలు

జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్‌ బ్యాంకులో నిరంతరం రక్త నిల్వలు అందుబాటులో ఉంచుతున్నాం. రెడ్‌ క్రాస్‌ సొసైటీ శిబిరాలతో పాటు నేరుగా బ్లడ్‌ బ్యాంకులో సేకరించిన రక్త నిల్వలను భద్రపరుస్తున్నాం. గర్భిణులు, బాలింతలు, రక్తహీనత సమస్య ఉన్న రోగులకు అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నాం. రక్తదానం చేస్తున్న యువతకు అభినందనలు.

– డాక్టర్‌ రాజీవ్‌ సపల, బ్లడ్‌ బ్యాంకు ఇన్‌చార్జి, జిల్లా సర్వజన ఆస్పత్రి, పాడేరు

శిబిరాలు నిర్వహిస్తున్నాం..

జిల్లా వ్యాప్తంగా రక్తదానంపై యువకులు, విద్యార్థుల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. యువకులు, విద్యార్థులు, అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు స్వచ్ఛందంగానే ముందుకు వస్తూ రక్తదానం చేస్తున్నారు.

– జి.గౌరిశంకర్‌రావు, రెడ్‌క్రాస్‌ సొసైటీ,

జిల్లా ప్రధాన కార్యదర్శి, పాడేరు

30 సార్లు రక్తదానం చేశా..

రక్తదానంతో తోటి మనుషుల ప్రాణాలు కాపాడవచ్చు. ఇప్పటి వరకు 30 సార్లు రక్తదానం చేశా. ఇది సామాజిక బాధ్యతగా భావిస్తున్నాను. ఇన్ని సార్లు రక్తదానం చేసినా ఆరోగ్యంగానే ఉన్నాను. అవకాశం ఉన్నంత వరకు రక్తదానం చేస్తా.

– జె.వికాస్‌,

చింతలవీధి, పాడేరు మండలం

ప్రతి మూడు నెలలకు రక్తదానం

ప్రతి మూడు నెలలకు ఒకసా రి రక్తదానం చేస్తున్నాను. రక్తదానంతో ప్రాణదాతలు కండి అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. ఇప్పటికి 20 సార్లు రక్తదానం చేశా. రక్తదానంపై అపోహాలు వీడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలి.

– ఓంటేబు సుమన్‌, గూడ గ్రామం,

హుకుంపేట మండలం

రక్త అవసరాలు గుర్తించా..

గిరిజన ప్రాంతంలో ప్రత్యక్షంగా రక్తం అవసరాలు గుర్తించా ను. నాది తెలంగాణా రాష్ట్రం. గత 14 ఏళ్లుగా ఇక్కడే వృత్తిరీత్యా పాడేరులోనే స్థిరపడ్డాను. ఇప్పటి వరకు 30 సార్లు రక్తదానం చేశాను. తోటి మనుషుల రక్త అవసరాల తీర్చడం సంతోషంగా ఉంది. – గట్ల సంతోష్‌కుమార్‌,

ఫోటోగ్రాఫర్‌, పాడేరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement