రెండు ట్రాక్టర్లు, పొక్లెయిన్‌ స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రెండు ట్రాక్టర్లు, పొక్లెయిన్‌ స్వాధీనం

Jun 14 2026 7:28 AM | Updated on Jun 14 2026 7:28 AM

పోలీసులు స్వాధీనం చేసుకున్న

పొక్లెయిన్‌, ట్రాక్టర్లు

మాకవరపాలెం: మట్టిని అక్రమంగా తవ్వుతున్న పొక్లెయిన్‌, తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని వజ్రగడ సమీపంలో నిత్యం అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అందిన సమాచారంతో శుక్రవారం అర్ధరాత్రి సిబ్బందితో దాడి చేసినట్టు ఎస్‌ఐ దామోదర్‌నాయుడు తెలిపారు. ఈ దాడిలో ఒక పొక్లెయిన్‌, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించామన్నారు. గంగవరం, రామన్నపాలెం, పైడిపాల తదితర ప్రాంతంలోనూ చెరువులు, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో రాత్రి వేళల్లో మట్టి తరలింపు జరుగుతున్నా ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement