విద్యా కిట్లు ఎక్కడ? | - | Sakshi
Sakshi News home page

విద్యా కిట్లు ఎక్కడ?

Jun 13 2026 7:14 AM | Updated on Jun 13 2026 7:14 AM

సాక్షి, పాడేరు: వేసవి సెలవులు అనంతరం ప్రభుత్వ పాఠశాలలు శుక్రవారం తెరుచుకున్నాయి. పునః ప్రారంభం రోజునే విద్యార్థులకు అందించాల్సిన విద్యా కిట్లు జిల్లాలో ఎక్కడా కానరాలేదు. చిరిగిన బ్యాగులు, నలిగిన పుస్తకాలతో విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. స్కూళ్లు తెరిచే రోజునే బ్యాగులు, పుస్తకాలు, యూనిఫాం, బెల్ట్‌, బూట్లు, సాక్సులు పంపిణీ చేస్తామన్న కూటమి ప్రభుత్వం మాట తప్పింది. కేవలం పుస్తకాల పంపిణీతో తొలిరోజు మమ అనిపించింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు మే నెల నాటికే విద్యా కానుక కిట్లను అందుబాటులోకి తేచ్చేది. వేసవి సెలవులు అనంతరం పాఠశాలల ప్రారంభం రోజునే బ్యాగులు, యూనిఫాంతో పాటు పుస్తకాలు పంపిణీ చేసేది. కూటమి పాలనలో గత విద్యా సంవత్సరం వలే ఈ ఏడాది కూడా పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులు విద్యా కిట్లను పొందలేకపోయారు. మరోవైపు విద్యార్థుల హాజరు శాతం బాగా తక్కువగా ఉంది. అన్ని యాజమాన్య ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి తొలి రోజు 30 శాతం మాత్రమే విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. వచ్చిన విద్యార్థులకు చాలా చోట్ల పుస్తకాలు మాత్రమే పంపిణీ చేశారు.

అల్లూరు, పోలవరం జిల్లాల యూనిట్‌గా విద్యా శాఖ పని చేస్తుంది. ఈ రెండు జిల్లాల పరిధిలోని 22 మండలాల్లో 2,913 పాఠశాలలకు సంబంధించి 1,77,733 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో చదువుతారని విద్యాశాఖ అంచనా వేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలల ప్రా రంభం రోజునే బ్యాగులు, పుస్తకాలు, ఇతర మెటీరి యల్‌ కిట్టును జగనన్న విద్యా కానుక పేరిట విద్యార్థులు అందుకునేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ రెండేళ్లలో ఆ పరిస్థితి లేకపోవడంతో విద్యార్ధులు ఉసూరుమంటున్నారు. విద్యార్థులకు సరిపడా బ్యాగులు, బూట్లు, సాక్సులు, బెల్ట్‌లు, యూని ఫాం క్లాత్‌లను కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు అందుబాటులోకి తేలేకపోయింది. గత విద్యా సంవత్సరంలో నాసిరకం బ్యా గులు పంపిణీ చేశారు. ఆ చిరిగిన బ్యాగులే విద్యార్థులకు ఈ ఏడాది కూడా దిక్కవుతున్నాయి. కొత్త బ్యాగు లు లేకపోవడంతో అనేక పాఠశాలల్లో విద్యార్థులంతా కొత్త, పాత పుస్తకాలను నెత్తిన పెట్టుకుని మోసుకెళ్లిన దృశ్యాలు జిల్లాలో పలుచోట్ల శుక్రవారం కనిపించాయి. గుడివా డ పాఠశాలలో మాత్రం అందుబాటులో ఉన్న బ్యాగు ల ను కలెక్టర్‌ చేతుల మీదుగా విద్యార్థులకు అందజే శారు. విద్యకు కూటమి ప్రభుత్వం ఇస్తున్నా ప్రాధా న్యం ఇదేనా? అంటూ పలువురు చర్చించుకున్నారు.

పునః ప్రారంభం రోజున

వెలవెలబోయిన ప్రభుత్వ పాఠశాలలు

యూనిఫామ్‌లు, విద్యాకానుక, పుస్తకాలు అందించని ప్రభుత్వం

చిరిగిన బ్యాగులు.. నలిగిన పుస్తకాలతో బడులకు వచ్చిన విద్యార్థులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement