నిర్ణీత గడువులోగా అర్జీల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

నిర్ణీత గడువులోగా అర్జీల పరిష్కారం

Jun 13 2026 7:14 AM | Updated on Jun 13 2026 7:14 AM

పాడేరు : ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్‌ఎస్‌)లో ప్రజల నుంచి స్వీకరిస్తున్న అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపేందుకు ఆయా శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నిశాంతి ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్‌ నిశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఆర్డీవో భుజంగరావు 126 అర్జీలు, రెవెన్యూ క్లీనిక్‌లో 44 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మండలాల్లో ప్రతి బుధవారం జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీజీఆర్‌ఎస్‌కు అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలన్నారు. గ్రీవెన్స్‌లో వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించి సమస్య త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. అర్జీదారులు మీకోసం కాల్‌ సెంటర్‌ 1100 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూ డీడీ పరిమల, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి పి.బాబు నాయక్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నంద్‌, డీఆర్డీఏ పీడీ మురళి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కృష్ణమూర్తి, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్షీరామ్‌ పడాల్‌, ఎల్‌డీఎం మాతునాయుడు, జిల్లా పరిశ్రమల అధికారి ఆర్‌.వి.రమణరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

పీజీఆర్‌ఎస్‌కు

సమగ్ర సమాచారంతో హాజరు కావాలి

అధికారులకు

కలెక్టర్‌ నిశాంతి ఆదేశం

పీజీఆర్‌ఎస్‌కు 126,

రెవెన్యూ క్లీనిక్‌కు 44 అర్జీలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement