అరకులోయటౌన్(పాడేరు రూరల్): పెండింగ్‌లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్రను వైఎస్సార్ సీపీ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం అరకులోయ జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఆమెను పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తడబారికి సురేష్‌కుమార్, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు సుందర్‌రావు, సీనియర్ నాయకులు శెట్టి లక్ష్మణ్‌రావు, సంపత్‌కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయా మండలాల పరిధిలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజురు చేసిన భవనాల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని విమర్శించారు. గ్రామ స్థాయిలో అంగన్‌వాడీ భవనాలు, నాడు–నేడు కింద పాఠశాలల భవనాలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఇప్పటికీ అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రజా సమస్యలపై అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు శ్రీకారం చుట్టాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు.
జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్రకు వినతి


