● కలెక్టర్ నిశాంతి
● బ్లడ్ బ్యాంక్ భవన నిర్మాణానికి
శంకుస్థాపన
అరకులోయటౌన్(పాడేరు రూరల్): ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నామని కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలో బీఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్(బెంగళూరు) సౌజన్యంతో రూ.95 లక్షల నిధులతో తలపెట్టిన రక్త నిధి(బ్లడ్ బ్యాంక్) నూతన భవన నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్కరికి రక్తం ఎంతో అవసరమని, అత్యవసర సమయంలో మైదాన ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులపై ఆధారపడకుండా స్థానికంగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. త్వరలోనే ఈ భవనం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు దేవదాసు, చిరంజీవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


