అచ్యుతాపురం రూరల్: పూడిమడక మత్స్యకారులకు సముద్ర భద్రతపై శుక్రవారం మైరెన్ ఎస్‌ఐలు జి.పైడిరాజు, బి.హెచ్.వి.ఎస్.ఎన్. రాజు, ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు డి.కె.స్వామి, ఎస్‌ఈ మహేష్, ఇండియన్ నేవీ ఉద్యోగి సందీప్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో మత్స్యకారులు, మత్స్యకార నాయకులతో మాట్లాడారు. సముద్ర భద్రత, వేట నిషేధ కాలంలో నిబంధనలపై అవగాహన కల్పించారు. అక్రమ రవాణా, అనుమానాస్పద కార్యకలాపాలు, విదేశీ బోట్ల సంచారం గమనించిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1093, కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్ టోల్ ఫ్రీ నంబర్ 1554కు సమాచారం అందించాలని కోరారు.


