రీ–ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యే వారిలో పరీక్ష భయం సహజంగానే ఉంటుంది. ఒకే సిలబస్‌ను 24 నుంచి 36 నెలల పాటు చదవడం వల్ల వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే పూర్తిగా సిలబస్ కవర్ చేశారు కాబట్టి, మళ్లీ మొదటి నుంచి చదవడం కంటే.. పాత పరీక్షలో చేసిన తప్పులను విశ్లేషించుకోవాలి. బలహీనంగా ఉన్న కాన్సెప్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిరంతరాయంగా చదవకుండా, మధ్యమధ్యలో ఆరోగ్యకరమైన స్టడీ బ్రేక్స్ తీసుకోవడం ఉత్తమం.
– డాక్టర్ పూజిత జ్యోస్యుల, సైకాలజిస్ట్


