అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు | - | Sakshi
Sakshi News home page

అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు

Jun 12 2026 12:29 AM | Updated on Jun 12 2026 12:29 AM

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణతులసీ దళార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. 108 స్వర్ణ తులసీ దళాలతో అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

● శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణం జరిపారు. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రంలను అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement