జి.మాడుగుల: స్థానిక రామలయం ప్రాంగణంలోని శ్రీ దామరాజు వెంకటయేగేంద్రుల (పాకలపాటి గురుదేవులు) ఆలయంలో గురువారం ఆయన 115వ జన్మదిన వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు మత్స్యరాస వెంకటగంగరాజు (బుజ్జి) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మొదట వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య గురుదేవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భజన బృందాల సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలరాజు పలువురు అర్చకులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ డాక్టర్ మత్స్యరాస వెంకటలక్ష్మి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డాక్టర్ తెరబరికి సురేష్ కుమార్, జీసీసీ గోడౌన్ సూపరింటెండెంట్ ఎం.సింహచలంరాజు, సమరసతా సేవా ఫౌండేషన్ జిల్లా ప్రముఖ్ మత్స్యరాస మత్స్యరాజు, కోటేశ్వరరావు, గిరి, నరసింహమూర్తి తదితర భక్తులు పాల్గొన్నారు.


