రైతులకు సకాలంలోవిత్తనాల పంపిణీ
● పీపీ బడుగు రమేష్‌బాబు
కొయ్యూరు: రైతులకు సరిపడా విత్తనాలను వ్యవసాయ శాఖ సకాలంలో పంపిణీ చేయాలని ఎంపీపీ బడుగు రమేష్‌బాబు కోరారు. గురువారం ఆయన పాడేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మంగతల్లి, తహశీల్దారు కె.ప్రసాదరావుతో కలిసి సింగవరం రైతు సేవా కేంద్రంలో 90 శాతం సబ్సిడీపై వచ్చిన వరి విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. వర్షాకాలం సమీపిస్తుండటంతో సాగు పనుల కోసం రైతులు విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారని, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.వ్యవసాయాధికారి శివరామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. మండలంలోని 17 రైతు సేవా కేంద్రాల్లో ప్రస్తుతం విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రధానంగా బీపీటీ 5204, ఎంటీయూ 1318, ఆర్‌ఎన్‌ఆర్ 15048, ఎంటీయూ 1121, ఎంటీయూ 1064 రకాల వరి విత్తనాలను నిల్వ ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అంబటి నూకాలు, ఏఎస్‌వో చైతన్య తదితరులు పాల్గొన్నారు.


