రెండు దుకాణాలు దగ్ధం ● సుమారు రూ.35 లక్షల ఆస్తి నష్టం | - | Sakshi
Sakshi News home page

రెండు దుకాణాలు దగ్ధం ● సుమారు రూ.35 లక్షల ఆస్తి నష్టం

Jun 11 2026 8:05 AM | Updated on Jun 11 2026 8:05 AM

రెండు దుకాణాలు దగ్ధం ● సుమారు రూ.35 లక్షల ఆస్తి నష్టం

ఎస్‌.రాయవరం: అడ్డురోడ్డు వాణిజ్య కేంద్రంలో రెండు దుకాణాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 35 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలివి. రాజస్థాన్‌ ప్రాంతానికి చెందిన నేషనల్‌ హర్డ్‌వేర్‌ దుకాణం, నాతవరానికి చెందిన మారుతి ఎలక్ట్రికల్‌ దుకాణాల్లో బుధవారం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పెయింట్‌ డబ్బాలు అంటుకోవడంతో మంటలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మారుతీ ఎలక్ట్రికల్‌ శానిటరీ దుకాణం పూర్తిగా కాలిబూడిదైపోవడంతో రూ.25 లక్షల వరకు, నేషనల్‌ హార్డ్‌వేర్‌ దుకాణంలో సుమారు రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక సీఐ ఎల్‌.రామకృష్ణ, ఎస్‌ఐ ప్రసాద్‌ హుటాహుటిన అక్కడకు చేరుకుని నక్కపల్లి ఫైరింజన్‌కు సమాచారం అందించి మంటలను అదుపు చేశారు. ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియలేదని చెప్పారు. స్థానిక వీఆర్‌వో వేణు నష్టం అంచనా విలువ నమోదు చేసుకున్నారు. మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు పోలీసులు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement