ఎస్.రాయవరం: కొరుప్రోలు గ్రామంలో బావిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ప్రసాదరావు బుధవారం తెలిపారు. ఈ మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ప్రత్తిపాటి సురేష్(35) మంగళవారం ఇంటి నుంచి పెద్ద చెరువుల్లో మట్టి తవ్వకాల్లో ట్రాక్టర్ నడిపేందుకు వెళ్లాడు. అప్పటినుంచి ఇంటికి రాలేదు. బుధవారం పెద చెరువు సమీపంలో గల బావిలో మృతదేహంగా తేలియుండటాన్ని పంచాయతీ సిబ్బంది చెప్పడంతో తండ్రి అబ్బులు పరిశీలించారు. సమాచారం అందుకున్న ఎస్.రాయవరం పోలీసులకు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహంపై ముఖంపై, కడుపు భాగంలో గాయాలై ఉండడాన్ని చూసి తండ్రి అబ్బులు తమ కుమారుడిని ఎవరో కొట్టి బావిలో పడేశారని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు ఇచ్చారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని నక్కపల్లి ఆసుపత్రికి తరలించామన్నారు.


