స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం 11.15 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి 11.47 గంటలకు బయలుదేరి..రాంనగర్ సెవెన్ హిల్స్ ఆసుపత్రికు చేరుకున్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. మీడియాతో మాట్లాడారు. 1.45 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి షీలానగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి 2.05 గంటలకు చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం 2.40 గంటలకు బయలుదేరి 2.55 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. 3.07 గంటలకు విమాన మార్గంలో గన్నవరం బయలుదేరి వెళ్లారు.


