ప్రజలకు అందుబాటులోఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు అందుబాటులోఉండాలి

Jun 10 2026 1:49 AM | Updated on Jun 10 2026 1:49 AM

అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

హుకుంపేట: సచివాలయ ఉద్యోగులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం సూచించారు. మండలంలో మట్టుజోరు గ్రామ సచివాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. రికార్డులను పరిశీలించిన అనంతరం సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతులకు సకలంలో సబ్సిడీతో కూడిన విత్తనాలు,ఎరువులు, పురుగు మందులను పంపిణీ చేయాలని ఏవో సుధాకర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల కార్యదర్శి సాల్మన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement