సాక్షి, పాడేరు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రెండేళ్ల కాలంలో రాక్షస పాలన అందించారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పూర్తయినందుకు నిరసనగా మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్ల పాలనలో ఆ హామీలను పూర్తిగా విస్మరించి, నిరంకుశంగా పాలించడం దారుణమన్నారు. చివరకు సూపర్ సిక్స్ హామీలను కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారని విమర్శించారు. గిరిజనులకు నూరు శాతం ఉద్యోగాలు కల్పించే జీవోనంబరు 3ను అమలు చేస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు వారికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. చంద్రబాబు పాలనలో అమలుకాని హామీలను, వైఫల్యాలను గ్రామగ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక ఎన్నికలలో నూరు శాతం స్థానాలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. అనంతరం చంద్రబాబు వెన్నుపోటుకు నిరసనగా ఎమ్మెల్యేతో పాటు నేతలంతా కలిసి నల్ల బెలూన్లను ఎగురవేశారు. మండల పార్టీ అధ్యక్షుడు సీదరి మంగ్లన్నదొర, జిల్లా మహిళా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, పాడేరు నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లో ఉర్వశిరాణి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి టి.బి.సురేష్‌కుమార్, మాజీ వ్యవసాయ మండలి అధ్యక్షురాలు మినుముల సరస్వతి, మాజీ పీఎసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి లకే రామసత్యవతి, ఎంపీటీసీలు లకే రామకృష్ణపాత్రుడు, సన్యాసిరావు, పార్టీ జిల్లా, స్థానిక నాయకులు వనుగు బసవన్నదొర, బొంజుబాబు, దశమూర్తి, కిల్లు కోటిబాబునాయుడు, బోనంగి వెంకటరమణ, సుదర్శన్, రాజేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
వెన్నుపోటుకు రెండేళ్లు కరపత్రాలను విడుదల చేస్తున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
ఏ ఎన్నికలు వచ్చినా చంద్రబాబుప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి
వైఎస్సార్‌సీపీ పాలనతోనే
ప్రజల సంక్షేమం సాధ్యం
పార్టీ జిల్లా అఽధ్యక్షుడు,
ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు


