రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన

Jun 9 2026 4:54 AM | Updated on Jun 9 2026 4:54 AM

10న కలెక్టర్‌ ఆధ్వర్యంలో పీజీఆర్‌ఎస్‌

రౌండు టేబుల్‌ సమావేశంలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

అరకులోయ లోయటౌన్‌(పాడేరు రూరల్‌): రాష్ట్రంలో అవినీతి, అరాచకపాలన సాగుతోందని, ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు సోమవారం నల్లబెలూన్లు ఎగురవేశారు. ఈ సందర్భంగా అరకులోయ టీటీడీ కల్యాణమండపంలో నిర్వహించి రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చి, అర్హులైన అభ్యర్థులను మోసం చేశారని ధ్వజమెత్తారు. స్పోర్ట్స్‌ కోటా పేరుతో అర్హులతో ఆడుకున్నారని ఆరోపించారు. డీఎస్సీలో అక్రమలకు బాధ్యతవహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ పదవికి రాజీనామ చేయాలని డిమాండ్‌ చేశారు. భవిషత్‌లో డీఎస్సీ అభ్యర్థుల పోరాటలకు వైఎస్సార్‌ సీపీ మద్దతు సంపుర్ణంగా ఉంటుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్లపాలనలో ఎన్నో అరాచకాలను చూశామని, వైద్యం, విద్యా ఇలా అన్ని రంగాలు అక్రమా లకు నిలయాలుగా మారాయన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు మరణిస్తున్నా, ఆస్పత్రుల్లో రోగు లతో పాటు శిశువులు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుకూడా ఉండడం లేదన్నారు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యానికి కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు కుట్రపన్నుతున్నాయని చెప్పారు. ఆదివాసీ చట్టాలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం అక్రమంగా హైడ్రోపవర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి యత్నిస్తోందని ఆరోపించారు. పీసా కమిటీ తీర్మానం లేకుండా ప్రాజెక్టుల ఏర్పాటు, మైనింగ్‌ తవ్వకాలకు అక్రమంగా అనుమతులు జారీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయే లక్ష్యం : స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీకోసం పనిచేసిన వారికే సముచితస్థానం లభిస్తుందని చెప్పారు. నియోజకవర్గంలో ని మండల అధ్యక్షులతో పాటు ఎంపీపీ,జెడ్పీటీసీ స భ్యులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్‌ నాయ కులు సమష్టిగా పనిచేయాలని సూచించారు.

త్వరితగతిన సభ్యత్వాలు పూర్తి : నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వాల నమోదును త్వరితగతిన పూరిత చేయాలనిఎమ్మెల్యే సూచించారు. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధిలో భాగంగా ఇన్సూరెన్స్‌ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ప్రతి కార్యకర్త ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకునేలా చూడాలని, నూరు శాతం గుర్తింపు కార్డులు జారీ చేయాలని చెప్పారు. జగనన్న ప్రభుత్వ హాయాంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వంచేస్తున్న కుట్రను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణిక్య,ఎస్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగభూషణ్‌,ఎస్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, జెడ్పీటీసీ సభ్యురాలు జానకమ్మ, ఎంపీపీలు ఈశ్వరి,వైఎస్సార్‌ సీపీ జిల్లా జనరల్‌ సెక్రెటరీ చిన్నసత్యం, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి, ఆరు మండలాల మండల అధ్యక్షులు పరుశురాం,రామూర్తి,సూర్యనారయణ,అనిల్‌, చిన్నబాబు,పార్టీ సీనియర్‌ నాయకులు అశోక్‌,ఆనంద్‌, నర్సింగరావు, జగన్‌కుమార్‌,విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

ముంచంగిపుట్టు : మండల కేంద్రం ముంచంగిపుట్టులో కలెక్టర్‌ నిశాంతి ఆధ్వర్యంలో ఈ నెల 10న పీజీఆర్‌ఎస్‌ నిర్వహించనున్నట్టు ఎంపీడీవో ధర్మారావు తెలిపారు. మండల ప్రజా పరిషత్‌ ఆవరణంలోని వెలుగు కార్యాలయం వద్ద ఉదయం 10గంటలకు అర్జీలు స్వీకరించనున్నట్టు చెప్పారు. జిల్లా,మండల స్థాయి అధికారులు పాల్గొంటారని తెలిపారు. మండల ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement