సీలేరు: ధారకొండ ధారాలమ్మ తల్లిని ఆదివారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వ హించిన అనంతరం పసుపు కుంకుమలు ఎమ్మెల్యే సమర్పించారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట గూడెంకొత్తవీధి ఎంపీపీ బోయిన కుమారి, వైఎస్సార్‌సీపీ చింతపల్లి మండలం మాజీ అధ్యక్షుడు మోరి రవి, బీసీ సెల్ నాయకులు బుజ్జి, అరకు నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్‌చార్జి పాంగి విజయ్, వైఎస్సార్‌సీపీ అరకు నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌చార్జి రామ్, గుల్లెల గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ సాగేని నాగరాజు, అరకు మండల యువజన విభాగం అధ్యక్షుడు బోయి కిరణ్ కుమార్, తెరవాడ వెంకట్రావు పాల్గొన్నారు.


