అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం
అరకులోయ టౌన్ (పాడేరు రూరల్): కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అరకులోయలోని టీటీడీ కల్యాణ మండపంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న ఆరాచక పాలన, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన అబద్దపు హమీలు, భవిష్యత్తు చర్చిస్తామన్నారు. ఈ సమావేశానికి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు ఆదివాసీ మేధావులు, నిరుద్యోగ, యువతీ యువకులు, పార్టీ శ్రేణులు హాజరు కావాలని ఆయన కోరారు.
విరగ్గాసిన పనస
కాయలతో పనస చెట్టు
గూడెంకొత్తవీధి: ఈఏడాది మన్యంలో పనస దిగుబడి ఆశాజనకంగా ఉంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున చెట్ల నిండా కాయలు కనిపిస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులు కలిసివస్తే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని గిరి రైతులు తెలిపారు.


