నిఘా నీడలో ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

నిఘా నీడలో ఎన్నికలు

Feb 11 2026 7:33 AM | Updated on Feb 11 2026 7:33 AM

నిఘా

నిఘా నీడలో ఎన్నికలు

వెయ్యి మందితో గట్టి బందోబస్తు ఇప్పటివరకు రూ.3లక్షల నగదు పట్టివేత రూ.6.19 లక్షల విలువైన మద్యం స్వాధీనం ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ ఎ న్నికలు నిఘా నీడలో జరగనున్నాయి. పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. స్టాటిస్టిక్‌ ఫోర్స్‌, ప్రత్యేక బలగాలతో పాటు పోలీస్‌, అటవీశాఖ, టీజీఎస్పీ, ఏసీబీ, జైళ్ల శాఖ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహించిన వారిపై కఠిన చర్యలు చేపట్టారు. 80 మద్యం కేసులు నమోదు కాగా, దాదాపు రూ.3లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 49 వార్డుల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. మంగళవారం టీటీడీసీ వద్ద పోలీస్‌ సిబ్బందికి ఎస్పీ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ సురేందర్‌ రావ్‌, ఏఎస్పీ మౌనిక, ట్రెయినీ ఐపీఎస్‌ రాహుల్‌ కాంత్‌, డీఎస్పీలు ఎల్‌.జీవన్‌రెడ్డి, పోతారం శ్రీనివాస్‌, ఇంద్రవర్ధన్‌ తదితరులున్నారు.

200 మంది బైండోవర్‌

పట్టణాన్ని మొత్తం 14 రూట్లుగా విభజించారు. ఇందులో 62 పోలింగ్‌ లొకేషన్లు, 216 పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా 163 బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ అమలు చేస్తున్నారు. గొడవలు సృష్టించే వారిని గుర్తించి ముందస్తుగా 200 మందిని బైండోవర్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా 20 మంది వద్ద ఉన్న ఆయుధాలను సేఫ్‌ డిపాజిట్‌ చేశారు.

భారీ బందోబస్తు

ఎస్పీ పర్యవేక్షణలో వెయ్యి మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 21 మంది సీఐలు, 48 మంది ఎస్సైలు, మహిళ సిబ్బంది, హోంగార్డులు, రిజర్వు పోలీసులు, సాయుధ పోలీసులు, స్పెషల్‌ పార్టీ బలగాలతో పాటు 53 మంది ఫారెస్ట్‌, ఇతర శాఖల సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. పది వార్డులకు ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ స్థాయి అధికారులతో ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నారు.

మద్యం, నగదు స్వాధీనం..

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పో లీసు శాఖ చర్యలు చేపట్టింది. అక్రమంగా మ ద్యం, నగదు తరలిస్తున్న వారిపై కేసులు నమో దు చేసింది. 80 మద్యం కేసుల్లో 378 లీటర్ల మ ద్యం స్వాఽ దీనం చేసుకోగా, వీటి విలువ రూ.6,19,647 ఉంది. అలాగే రూ.29లక్షల 90వే ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఐదు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, ఐదు స్టాటిస్టిక్‌ చెక్‌పోస్టులను ఏర్పా టు చేశారు. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 86 కేసులు నమోదయ్యాయి.

ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హ క్కు వినియోగించుకోవాలి. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎన్నికల నిబంధనలు అమలులో ఉంటాయి. లోనికి సెల్‌ఫోన్లు, వాట ర్‌, ఇంక్‌ బాటిళ్లు, ఆయుధాలు, పెన్నులు, అగ్నికి సంబంధించిన వాటిని తీసుకెళ్లొద్దు. ఓటర్లను ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించడం జరుగుతుంది. ఎవరైనా సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు. ఎన్నికలు పూర్తయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దు. అధికారుల అనుమతి తీసుకొని నిర్ధారించిన తేదిలో జరుపుకోవాలి. టపాసులు కూడా పేల్చవద్దు. ఎలాంటి సమాచారం ఉన్నా డయల్‌ 100కు తెలియజేయాలి.

– అఖిల్‌ మహాజన్‌, ఎస్పీ

నిఘా నీడలో ఎన్నికలు1
1/1

నిఘా నీడలో ఎన్నికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement