మలయాళ నటి అంజు కురియన్ నిశ్చితార్థం చేసుకుంది.
రోషన్ బాకబ్ అనే వ్యక్తితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతుంది.
కేరళలోని కొట్టాయంలో శనివారం ఈ శుభకార్యం జరిగింది.
ఈ క్రమంలోనే ఫొటోలు, వీడియోలని అంజు ఇన్ స్టాలో షేర్ చేసింది.
మలయాళీ అయిన అంజు.. తమిళంలో పలు సినిమాలు చేసింది.
సహాయ నటిగా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది.
2018లో తెలుగులో వచ్చిన 'ఇదం జగత్' మూవీతో టాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది.
చివరగా 'అబ్రహం ఓజ్లర్' సినిమాలో అంజు కురియన్ కనిపించింది.
ఏదేమైనా ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ చేసుకుని సర్‌ప్రైజ్ ఇచ్చినట్లే.
బహుశా ఈ ఏడాది డిసెంబరు లేదా జనవరిలో పెళ్లి చేసుకునే అవకాశముంది.
31 ఏళ్ల అంజు.. పెళ్లి తర్వాత యాక్టింగ్ పక్కనబెట్టేస్తుందా లేదా కొనసాగిస్తుందా అనేది చూడాలి!


