దోషిగా తేలిన శివకుమార్ | Uber cab driver Shiv Kumar Yadav convicted | Sakshi
Sakshi News home page

దోషిగా తేలిన శివకుమార్

Oct 20 2015 11:17 AM | Updated on Aug 30 2018 9:02 PM

దోషిగా తేలిన శివకుమార్ - Sakshi

దోషిగా తేలిన శివకుమార్

మహిళా ఎగ్జిక్యూటివ్ పై అత్యాచారానికి పాల్పడిన కేసులో 'ఉబర్' క్యాబ్‌ డ్రైవర్ శివకుమార్ యాదవ్‌ ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది.

న్యూఢిల్లీ: మహిళా ఎగ్జిక్యూటివ్ పై అత్యాచారానికి పాల్పడిన కేసులో 'ఉబర్' క్యాబ్‌ డ్రైవర్ శివకుమార్ యాదవ్‌ ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. ఈనెల 23న అతడికి శిక్ష ఖరారు చేయనుంది. అతడిపై మోపిన అన్ని అభియోగాలు కోర్టులో నిరూపితం అయ్యాయని అతడి తరపు న్యాయవాది ధర్మేంద్ర కుమార్ మిశ్రా తెలిపారు.

గతేడాది డిసెంబర్ 5వ తేదీన రాత్రి బాధితురాలు(25) ఇంటికొచ్చే క్రమంలో కారులోనే ఆమెపై శివకుమార్ లైంగికదాడికి పాల్పడినట్టు కేసు నమోదు అయ్యింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా నిందితుడిని మధురలో డిసెంబర్ 7వ తేదీన అరెస్టు చేశారు. ఈ కేసులో 100 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేశారు. 44 మందిని సాక్షులను విచారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement