ఈ ముగ్గురు పోటీ చేయలేదు | The three did not contest | Sakshi
Sakshi News home page

ఈ ముగ్గురు పోటీ చేయలేదు

Nov 9 2015 2:55 AM | Updated on Mar 29 2019 9:31 PM

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్, జేడీయూ కీలక నేత, మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమార్, బీజేపీ సీనియర్ నేత, రాష్ట్రంలో పార్టీ ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్న

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్, జేడీయూ కీలక నేత, మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమార్, బీజేపీ సీనియర్ నేత, రాష్ట్రంలో పార్టీ ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్న సుశీల్ కుమార్ మోదీల మధ్య ఈ ఎన్నికలకు సంబంధించి ఓ సారూప్యం ఉంది. ఈ ముగ్గురు ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తమతమ పార్టీల తరఫున రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం సాగించారు. దాణా కుంభకోణంలో దోషిగా తేలడంతో లాలూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు.

2004లో నలంద నుంచి లోక్‌సభకు పోటీ చేసిన నితీశ్.. ఆ తరువాత ఏ ప్రత్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. శాసనమండలి సభ్యుడిగా సీఎం పదవి చేపట్టారు. బిహార్ పీసీసీ అధ్యక్షుడు అశోక్ చౌధరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంగళ్ పాండే కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement