ముంబైకి చెందిన ఓ సంగీతం మాస్టారు శంషాబాద్ విమానాశ్రయంలో అదృశ్యమయ్యారు.
శంషాబాద్: ముంబైకి చెందిన ఓ సంగీతం మాస్టారు శంషాబాద్ విమానాశ్రయంలో అదృశ్యమయ్యారు. ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ముంబై వర్లీలోని జీఎం భోస్లే రోడ్డులో నివాసం ఉండే సంజయ్ మిస్త్రీ(33) అక్కడ ఓ పాఠశాలలో సంగీతం మాస్టారుగా పనిచేస్తున్నారు. వారం క్రితం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమానికి పది మంది బృందంతో ఆయన పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం సంగీతం బృందం సభ్యులంతా కలసి ఈనెల 16వ తేదీన సాయంత్రం ముంబై వెళ్లడానికి ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. మిగతా బృందం ముంబై బయలుదేరగా తాను తర్వాత వస్తానని సంజయ్ సహచరులకు చెప్పారు. అప్పటి నుంచి అతడి ఫోన్ స్విచ్‌ఆఫ్ వస్తోంది. సంజయ్ ఇంటికి చేరుకోకపోవడంతో అతడి భార్య శ్వేతమిస్త్రీ గురువారం ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.