బీజేపీ కార్యాలయ సిబ్బందికి బోనస్ | bjp head office staff get bonus | Sakshi
Sakshi News home page

బీజేపీ కార్యాలయ సిబ్బందికి బోనస్

Jun 1 2014 7:58 PM | Updated on Mar 29 2019 5:57 PM

లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో పార్టీ కార్యాలయ సిబ్బందికి బోనస్ ప్రకటించారు.

న్యూఢిల్లీ: ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు అందరు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన బీజేపీ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయ సిబ్బందికి వేతనాలను స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరముందన్నారు. ప్రజాసంక్షేమంలో పరీక్ష పాసయితే ప్రజలు మనల్ని నెత్తిన పెట్టుకుంటారని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో పార్టీ కార్యాలయ సిబ్బందికి బోనస్ ప్రకటించారు. మూడు నెలల జీతాన్ని ఇంటెన్సివ్ గా ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement