ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని గురువారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సి.లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
ఖమ్మంలో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్
Jun 30 2016 3:42 PM | Updated on Sep 4 2017 3:49 AM
ఖమ్మం: ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని గురువారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సి.లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ జిల్లాల్లో మొదటగా ఖమ్మంలోనే ఇలాంటి కేంద్రాన్ని ప్రారంభించినట్లు మంత్రులు తెలిపారు. ఈ సెంటర్‌లో క్యాన్సర్ బాధితులకు పరీక్షలు, చికిత్స, మందులు ఉచితంగా అందజేయనున్నట్లు వివరించారు. పభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత డయాలసిస్, డయాగ్నొసిస్ కేంద్రాలను కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. ప్రజారోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, కావాల్సినన్ని నిధులు కేటాయిస్తున్నారని వారు పేర్కొన్నారు.
Advertisement
Advertisement