దొంగలముఠా అరెస్ట్ | Thieves gang arrested | Sakshi
Sakshi News home page

దొంగలముఠా అరెస్ట్

Jul 30 2015 6:00 PM | Updated on Aug 28 2018 7:30 PM

నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

కుత్బుల్లాపూర్ (హైదరాబాద్ ) : నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక కారు, ఒక బైకు తోపాటు రూ. 11 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బాలనగర్ ఏసీపీ గురువారం పాత్రికేయుల సమావేశంలో తెలిపారు.

గాజుల రామారం పరిధిలోని రొడ్డ మేస్త్రీనగర్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి నగర పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. వీరి మీద పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా ముఠాను పట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement