నగరంలోని చైతన్యపురిలో అనుమతులు లేకుండా నడుస్తున్న ఫార్మా కంపెనీపై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు.
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చైతన్యపురిలో అనుమతులు లేకుండా నడుస్తున్న ఫార్మా కంపెనీపై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. ఎలాంటి లైసెన్సులు లేకుండా తయారు చేసిన టాబ్లెట్లు, టానిక్స్, మదర్ ప్రో మిక్స్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకర డ్రగ్స్ వాడుతూ వీటిని తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మిషనరీని, వివిధ ఉత్పత్తులను సీజ్ చేసి కేసును చైతన్య పురి పోలీసులకు అప్పగించారు.