జూనియర్‌ కాలేజీల ప్రారంభం వాయిదా 

Reopening Of Junior Colleges Postponed - Sakshi

 జూలై మూడో వారంలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జూనియర్‌ కాలేజీ ల ప్రారంభాన్ని ఇంటర్మీడియట్‌ బోర్డు వాయిదా వేసింది. ఇంటర్మీడియట్‌ అకడమిక్‌ కేలండర్‌ ప్రకారం వేసవి సెలవులు ముగిశాక జూన్‌ 1 నుంచి తరగతులను ప్రారంభించాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ఆ తేదీన జూనియర్‌ కాలేజీలను ప్రారంభించడం లేదని, తరగతుల నిర్వహ ణను చేపట్టడం లేదని బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ తరువాత తెలియజేస్తామన్నారు. 

‘అడ్వాన్స్‌డ్‌’లో రాసుకోవచ్చు 
ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర జియాగ్రఫీ పేపరు–2, మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపరు–2 పరీక్షలను జూన్‌ 3న నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. ఉదయం 9 గంటల నుం చి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉం టాయన్నారు. విద్యార్థులు  జ్టి్టpట://్టటbజ్ఛీ. ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసు కోవాలని సూచించారు. ఇక ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను జూలై మూడో వారంలో నిర్వహిస్తామని తెలిపారు. రవాణా సదుపాయం, ఇతరత్రా కారణాలతో 3న పరీక్షల కు హాజరు కాలేని విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఈ సబ్జెక్టులను రాసుకోవచ్చని, అపుడు పరీక్షలు రాసినా రెగ్యులర్‌ విద్యార్థులుగా నే పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top