మానవత్వం చాటుకున్న మంత్రి 

Minister Sabitha Indra Reddy Helps Move Accident Victim To Go Hospital - Sakshi

చేవెళ్ల: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ముడిమ్యాలకు సమీపంలోని దామరగిద్దకు వెళ్తున్న బంటు నర్సింలును గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. దీంతో అతడు గాయపడి రోడ్డుపై పడిపోయాడు. సొంతూరు కౌకుంట్ల నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న మంత్రి సబిత ప్రమాద విషయా న్ని గమనించి తన కాన్వాయ్‌ను ఆపి వ్యక్తి ని 108లోకి ఎక్కించారు. దామరగిద్ద సర్పంచ్‌కు సమాచారం అందించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top