'టెక్స్‌టైల్‌ పార్కు అభివృద్ధికి నిధులు' | minister ktr speaks over siricilla textile park | Sakshi
Sakshi News home page

'టెక్స్‌టైల్‌ పార్కు అభివృద్ధికి నిధులు'

Feb 25 2017 5:31 PM | Updated on Aug 30 2019 8:24 PM

'టెక్స్‌టైల్‌ పార్కు అభివృద్ధికి నిధులు' - Sakshi

'టెక్స్‌టైల్‌ పార్కు అభివృద్ధికి నిధులు'

సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధికి రాబోయే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని కేటీఆర్ చెప్పారు.

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధికి రాబోయే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని చేనేత, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. దక్షిణ భారత టెక్స్‌టైల్ మిల్లుల ప్రతినిధుల బృందం సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌ను శనివారం సందర్శించింది. ఆ ప్రతినిధుల బృందంతో మంత్రి భేటీయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ త్రిపుర రాష్ర్టాన్ని ఆదర్శంగా తీసుకుని సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. త్వరలోనే త్రిపురలో స్టడీ టూర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో కోయంబత్తూరు, తిరుపూరు మిల్లుల యజమానులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement