
ఉమ్మడి జిల్లాలో ఇద్దరు యువకుల ఆత్మహత్య
సాక్షి, కరీంనగర్ (చొప్పదండి) : ‘నాకు పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పాడు..ఇక నాకు బతకాలని లేదు.. నన్ను క్షమించండి..నా చావుకు ఎవరూ బాధ్యులు కారు’.. అని సూసైడ్ నోటు రాసి, హనుమాన్ దీక్షలో ఉన్న యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్యాల మండలంలోని తక్కళ్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తక్కళ్లపల్లి గ్రామానికి చెం దిన ఎడ్ల మనోజ్(25) ఆరు నెలల క్రితం వివా హం చేసుకున్నాడు. పిల్లలు పుట్టడం లేదంటూ పదిహేను రోజుల క్రితం మనోజ్ ఆస్పత్రికి వెళ్లగా, పలు పరీక్షలు చేసిన అనంతరం వైద్యుడు మనోజ్‌కు పిల్లలు పుట్టరని తేల్చి చెప్పా డు. దీంతో మానసికంగా కుంగిపోయిన మనోజ్ బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలాన్ని ఎస్సై నీలం రవి పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కనగర్తిలో ఒకరు..
ఇల్లందకుంట(హుజూరాబాద్): మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన దరుగుల వెంకటేష్ (32)జీవితంపై విరక్తి చెంది ఇంట్లోఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. వెంకటేశ్‌కు ఏడేళ్లక్రితం నిర్మల అనే మహిళతో వివాహం జరిగింది. అప్పటి నుంచి పిల్లలు పుట్టకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి కుటుంబసభ్యులు గమనించారు. అతడి తండ్రి మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై నరేష్‌కుమార్ కేసు నమోదు చేశారు.