వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ చౌరస్తాలో బుధవారం ఓ హిజ్రా హల్‌చల్ చేసింది.
సాక్షి, వరంగల్ అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ చౌరస్తాలో బుధవారం ఓ హిజ్రా హల్‌చల్ చేసింది. చౌరస్తాలో షాపింగ్ చేస్తున్న యువకులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసింది. అక్కడ పోలీసులు ఉన్నా చూసీ చూడనట్లు వ్యవహరించడంతో రెండు గంటల పాటు నానా హంగామా చేసింది. హిజ్రాల చర్యల పట్ల స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు.