రాఖీ కట్టండి.. హెల్మెట్‌ ఇవ్వండి

Helmet Gift to Your Brothers In This Rakhi Festival : Hyderabad CP - Sakshi

సిటీ సీపీ అంజనీకుమార్‌

సాక్షి, సిటీబ్యూరో: రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరూ అక్కాచెల్లెళ్లు.. తమ అన్నాతమ్ముళ్లకు రాఖీ కట్టి హెల్మెట్‌ బహుమతిగా ఇవ్వాలని సిటీ సీపీ అంజనీకుమార్‌ పిలుపునిచ్చారు. ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలను నివారించొచ్చని అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సిస్టర్‌ ఫర్‌ ఛేంజ్‌... గిఫ్ట్‌ ఎ హెల్మెట్‌’ అవగాహన ర్యాలీని ఆయన సోమవారం కమిషనర్‌ కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు జాగృతి సభ్యులను అభినందిస్తున్నానన్నారు. జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర నాయకులు విజయ్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top