రూ.8.1 లక్షలు పలికిన బంగారు లడ్డూ | Gold Laddu Auction In hyderabad | Sakshi
Sakshi News home page

రూ.8.1 లక్షలు పలికిన బంగారు లడ్డూ

Sep 23 2018 8:43 AM | Updated on Sep 23 2018 8:43 AM

Gold Laddu Auction In hyderabad - Sakshi

బంగారు లడ్డూతో కాడబోయిన భాస్కర్‌

కవాడిగూడ: ముషీరాబాద్‌ నియోజకవర్గం భోలక్‌పూర్‌ హౌస్‌ శ్రీసిద్ధి వినాయక భగత్‌సింగ్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12 తులాల బంగారంతో తయారైన గణపతి లడ్డూ వేలంలో రూ.8.1 లక్షలు పలికింది. భోలక్‌పూర్‌కు చెందిన చేపల వ్యాపారి కాడబోయిన భాస్కర్‌ 11 కేజీల సాధారణ లడ్డూతో పాటు బంగారు లడ్డూను దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా గణపతి వద్ద బంగారు లడ్డూను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు జి.అనిల్‌ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ గ్రేటర్‌ అధ్యక్షుడు ఎం.ఎన్‌.శ్రీనివాస్‌రావు, భోలక్‌పూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు నవీన్‌కుమార్, బీజేపీ ముషీరాబాద్‌ నియోజకవర్గ కో–కన్వీనర్‌ ఎం.నవీన్‌గౌడ్, నాయకులు శ్రీధర్‌చారి, రవిచారి, ముప్పిడి నర్సింగ్‌రావు, బబ్లూ, భాను, కిశోర్‌యాదవ్, పరమేష్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement