దమ్ము చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం గోల్‌యాతండాలో జరిగింది.
టేకులపల్లి (ఖమ్మం జిల్లా) : దమ్ము చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం గోల్‌యాతండాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బోడ భీమా(35) తన సొంత ట్రాక్టర్ సహాయంతో కిరాయిలు చేస్తూ తన పొలాన్ని సాగు చేస్తున్నాడు. కాగా గురువారం తన పొలంలో దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ బురదలో కూరుకుపోయింది.
కాగా ట్రాక్టర్‌ను బయటకు తీసే క్రమంలో బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌పై ఉన్న బోడ భీమా బురదలో చిక్కుకొని ఊపిరాడక మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బురదలో నుంచి వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య పరామర్శించి సానుభూతి ప్రకటించారు.