తెలంగాణ సీఎంఆర్ఎఫ్లో నకిలీ బిల్లుల స్కాం | fake bills scam in telangana cmrf busted, kcr orders cbcid enquiry | Sakshi
Sakshi News home page

తెలంగాణ సీఎంఆర్ఎఫ్లో నకిలీ బిల్లుల స్కాం

Jan 29 2015 7:30 PM | Updated on Aug 11 2018 7:08 PM

తెలంగాణ సీఎం సహాయనిధిలో అక్రమాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సీరియస్ అయ్యారు.

తెలంగాణ సీఎం సహాయనిధిలో అక్రమాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సీరియస్ అయ్యారు. కొన్ని ఆస్పత్రులు నకిలీ బిల్లులు పెట్టి సొమ్ము చేసుకున్న వ్యవహారం ఆయన దృష్టికి రావడంతో దీనిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. నకిలీ బిల్లులతో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండులో చేతివాటం చూపించినట్లు వెలుగుచూసింది. దీనిపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు.

నిజమైన పేదలు వైద్యం చేయించుకోడానికి ఇబ్బంది పడుతుంటే వారికి సాయం చేసేందుకు ఉద్దేశించిన సీఎంఆర్ఎఫ్ గత కొన్ని రోజులుగా కొన్ని ఆస్పత్రుల్లో దుర్వినియోగం అవుతోంది. ఉదారంగా సాయం చేస్తుందని తెలుసుకున్న కొందరు వ్యక్తులు నకిలీ బిల్లులు సృష్టించి సొమ్ము చేసుకున్న వ్యవహారం సీఎం దృష్టికి వచ్చింది. గత ఏడు నెలల్లో జరిగిన విషయాలపై సీబీసీఐడీ దర్యాప్తు చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎవరెవరి ప్రమేయం ఉందో విచారణ జరిపి నిజనిర్ధారణ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సీఎం వ్యక్తిగత కార్యదర్శి కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement