నేరం చేయాలంటే భయపడాలి

DGP Mahender Reddy Gives Speech At MS Krishnan Auditorium - Sakshi

శిక్ష పడుతుందనే భయం నేరస్తుల్లో కలగాలి

అప్పుడే నేరాలు చేయడానికి జంకుతారు

డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడి 

మన్సూరాబాద్‌: నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం నేరస్తుల్లో కలిగినప్పుడు నేరాలు చేయడానికి జంకుతారని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ఎల్‌బీనగర్‌ జీఎస్‌ఐటీఐలోని ఎంఎస్‌.కృష్ణన్‌ ఆడిటోరియంలో గురువారం కన్వెన్షన్స్‌ రివార్డ్‌ మేళాను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, ప్రాసిక్యూషన్‌ అధికారులకు రివార్డులు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ మాట్లాడుతూ.. పోలీస్, న్యాయ వ్యవస్థల పై సమాజం పెట్టుకున్న నమ్మకాన్ని సాధించిన వాళ్లమయ్యామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు, ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ, పోలీసు లు, ప్రాసిక్యూటర్స్‌ క్రిమినల్‌ జస్టిస్‌లో ఉన్న అన్ని విభాగాలు ప్రజలు ఆశించేలా చట్టప్రకారం నడు చుకోవాలని సూచించారు.

చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్పనిసరిగా దొరికిపోతామనే భయం.. దొరికాక శిక్ష పడుతుందనే నమ్మకాన్ని కలిగించడం మన బాధ్యతన్నారు. నేరం ఎవరు చేసినా నిజాన్ని బ యటకు తెచ్చి న్యాయంగా, ధర్మంగా నేరం చేసిన ప్రతిసారి శిక్ష పడుతుందనే భయం కల్పిస్తే.. సమాజంలో ఎవరైనా నేరం చేయడానికి భయపడతారని తెలిపారు. నేరస్తులను గుర్తించేందుకు, నేరాలను పరిశోధించేందుకు వీలుగా రాష్ట్రంలో 67 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని చె ప్పారు. నేరస్తుడిని అరెస్టు చేయడమే కాకుండ శిక్ష పడేలా చేస్తేనే ప్రజలకు పోలీసులపై గౌరవం పె రుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో విచారణ చేపట్టి నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించిన 226 మంది పోలీసు, న్యాయ అధికారులను శాలువాలు, రివార్డులతో సన్మానించా రు. కార్యక్రమంలో ప్రాసిక్యూషన్స్‌ రాష్ట్ర డైరెక్టర్‌ జి.వైజయంతి, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తదితరులు పాల్గొన్నారు.  

ప్రాసిక్యూటర్‌ను సత్కరిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి. చి్ర‘తంలో మహేశ్‌ భగవత్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top