నగరంలో కార్డన్ సెర్చ్ | Cordon and search in Meerpet | Sakshi
Sakshi News home page

నగరంలో కార్డన్ సెర్చ్

Oct 11 2015 6:45 AM | Updated on Sep 3 2017 10:47 AM

అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం మీర్ పేట, లెనిన్ నగర్లలో నిర్వహించారు.

హైదరాబాద్ : అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం మీర్ పేట, లెనిన్ నగర్లలో నిర్వహించారు. ఎల్బీ నగర్ డీసీపీ ఇక్బాల్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో సరైన పత్రాలు చూపించని 24 బైక్ లు, 4 ఆటోలు, 2 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. 100 గ్రాముల గంజాయి, 62 క్వార్టర్ల మద్యం పట్టుబడింది. తొమ్మిదిమంది అనుమానితులను, ఇద్దరు చైన్ స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement