ట్రైనీ ఐపీఎస్‌ను ఎలా సస్పెండ్‌ చేస్తారు?

Central Administrative Tribunal Questioning The Union Home Department - Sakshi

కేంద్ర హోం శాఖను ప్రశ్నించిన క్యాట్‌

సాక్షి, హైదరాబాద్‌: ట్రైనీ ఐపీఎస్‌ అధికారి కేవీ మహేశ్వర్‌రెడ్డిని సస్పెండ్‌ చేసిన విధానంపై సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ (క్యాట్‌) కీలక ప్రశ్నలను సంధించింది. ఆరోపణలు వస్తే దర్యాప్తులో భాగంగా సరీ్వస్‌ నుంచి మాత్రమే సస్పెండ్‌ చేసేందుకు నిబంధ నలు అనుమతిస్తున్నాయని, నియామ క ఉత్తర్వులను ఎలా సస్పెండ్‌ చేస్తారని కేంద్ర హోం శాఖను ప్రశి్నంచింది. దీనిపై వివరణ ఇవ్వాలని క్యాట్‌ అడ్మిని్రస్టేటివ్‌ మెంబర్‌ బీవీ సుధాకర్‌ బుధవారం కేంద్ర హోం శాఖను ఆదేశించా రు. సెంట్రల్‌ సరీ్వసెస్‌ ఆఫీసర్స్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా మహేశ్వర్‌రెడ్డిని ఎలా సస్పెండ్‌ చేశారో వివరణ ఇవ్వా లని కోరారు.

తనను పెళ్లి చేసుకున్నాక మోసం చేశాడని భువన అనే మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మహేశ్వర్‌రెడ్డి వివరణ ఇచ్చాక ఏం జరిగిందో చెప్పాలని ముస్సోరీలో ని కేంద్ర సరీ్వసుల శిక్షణ కేంద్రం డైరెక్టర్‌ను క్యాట్‌ ఆదేశించింది. మహేశ్వర్‌  వివరణను జాతీయ పోలీస్‌ అకాడమీ, కేంద్ర హోం శాఖలకు తెలియజేశారో లేదో చెప్పాలని వివరణ అడిగింది. తదుపరి విచారణ ఈ నెల 24కి వాయి దా వేసింది. ఆరోపణల ఫిర్యాదు ఆధారంగా తనను సస్పెండ్‌ చేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ మహేశ్వర్‌రెడ్డి క్యాట్‌ను ఆశ్రయించగా.. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోం శాఖను క్యాట్‌ ఆదేశించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top