రైతులకు భరోసా ఇచ్చి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని రాహుల్‌గాంధీ పాదయాత్ర తలపెడితే అటు కేంద్రంలోని..
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతులకు భరోసా ఇచ్చి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని రాహుల్‌గాంధీ పాదయాత్ర తలపెడితే అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ పార్టీలు భయపడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గాంధీభవన్‌లో బుధవారం జరిగిన ఎన్‌ఎస్‌యూఐ సమావేశంలో, అంతకుముందు జరిగిన పాదయాత్ర సీడీ ఆవిష్కరణ కార్యక్రమంలో వారు మాట్లాడారు.
వ్యవసాయం సంక్షోభంలో ఉన్నప్పుడు, రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వాల కళ్లు తెరిపించడమే రాహుల్ పాదయాత్ర లక్ష్యమని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. రాహుల్‌గాంధీ పాదయాత్రలో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఉత్తమ్, భట్టి పిలునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు డి.శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణా రెడ్డి, కె.లక్ష్మారెడ్డి, కొనగల మహేశ్ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రకోసం ప్రత్యేకంగా రూపొందించిన సీడీలను భట్టివిక్రమార్క, మాజీమంత్రి డి.శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు.