7 నుంచి బీసీల రాజకీయ చైతన్య యాత్ర

BC Leader Jajula Srinivas Goud Says Future Plans - Sakshi

జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడి

హైదరాబాద్‌: పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు బీసీల వాటా బీసీలకే దక్కాలన్న నినాదంతో బీసీల రాజకీయ చైతన్య యాత్రను చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ‘పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు’అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 7నుంచి సెప్టెంబర్‌ 7వరకు చేపట్టనున్న ఈ యాత్ర 80 నియోజకవర్గాల గుండా సాగుతుందన్నారు. మండల్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు జరిగిన రోజు నుంచే యాత్ర ప్రారంభమవుతుందని, పార్టీలకు అతీతంగా బీసీలందరూ పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని కోరారు.

అన్ని రాజకీయ పార్టీలు బీసీలను కార్యకర్తలుగానే చూస్తున్నారు తప్ప రాజ్యాధికారంలో బీసీల వాటా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన అగ్రకుల నాయకులు హైకోర్టులో కేసు లు వేసి బీసీలను రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, బీసీ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అ«ధ్యక్షుడు శ్రీనివాసరావు, బీసీ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top